Vande Bharat Train: మరోసారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వార్తల్లో నిలిచింది. గతంలో పలుమార్లు ఈ రైలులో వడ్డించిన భోజనంలో దుర్వాసన రావడం, బొద్దింకలు, ఇతర కీటకాలు రావడంపై రైల్వే శాఖ విమర్శలను ఎదుర్కొంది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఫిబ్రవరి 1న రాణి కమలాపతి నుంచి జబల్ పూర్ వెళ్తున్న ఓ ప్రయాణికుడికి రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక వచ్చింది.