దేశ భద్రతను, సంపదను రక్షించేందుకు భారత రక్షణ దళాలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయి. అధునాతన ఆయుదాలను త్రివిధ దళాలు సమకూర్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ మహే యుద్ధనౌకను భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన మహే శ్రేణిలో ఇది మొదటిది. జనరల్ ఉపేంద్ర ద్వివేది దీనిని స్వావలంబన భారత్ శక్తిగా అభివర్ణించారు. ఈ నౌక శత్రు జలాంతర్గాములను గుర్తించి నాశనం చేస్తుంది.…