Javier Aguirre: హోండురాస్‌తో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ నార్త్, సెంట్రల్ అమెరికా అండ్ కరేబియన్ అసోసియేషన్ ఫుట్‌బాల్ (CONCACAF) నేషన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్‌లో మెక్సికో ప్రధాన కోచ్ జేవియర్ అగ్యిర్ ఫుట్‌బాల్ హింసను ఎదుర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత, 65 ఏళ్ల కోచ్ ప్రత్యర్థి ప్రధాన కోచ్ రేనాల్డో రుయెడాతో కరచాలనం చేసేందుకు టచ్‌లైన్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో స్టాండ్ నుండి విసిరిన డబ్బా కోచ్ తలకు తగిలి అతని గాయం రక్తస్రావం ప్రారంభమైంది.…