ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో లోక్ సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాలకు సంబంధించిన నేతలు పాల్గొన్నారు. రాష్ట్రాలకు చెందిన లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కో-ఆర్డినేటర్లు పార్టీకి కళ్లు, చెవులు లాంటివారని అన్నారు. మైక్రో లెవల్ లో రాజకీయ, సామాజిక పరిస్థితులు పరిశీలించాలని తెలిపారు.…