ఇకపై ఆ రాష్ట్రంలో బాలురు, బాలికలకు వేరువేరు పాఠశాలలనే ముచ్చటే ఉందడు.. మొత్తం అన్ని విద్యాలయాల్లో కో-ఎడ్యుకేషనే ఉండబోతోంది. ఇంతకీ అది ఏ రాష్ట్రమో కాదు..అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉన్న కేరళ. కేరళలో ఉన్న బాయ్స్, గర్ల్స్ స్కూల్స్ ఇక గతం కాబోతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు బాయ్స్, గర్ల్స్ తో మిశ్రమ పాఠశాలలుగా మార్చాలని కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.