ఇకపై ఆ రాష్ట్రంలో బాలురు, బాలికలకు వేరువేరు పాఠశాలలనే ముచ్చటే ఉందడు.. మొత్తం అన్ని విద్యాలయాల్లో కో-ఎడ్యుకేషనే ఉండబోతోంది. ఇంతకీ అది ఏ రాష్ట్రమో కాదు..అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉన్న కేరళ. కేరళలో ఉన్న బాయ్స్, గర్ల్స్ స్కూల్స్ ఇక గతం కాబోతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు బాయ్స్, గర్ల్స్ తో మిశ్రమ పాఠశాలలుగా మార్చాలని కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి అన్ని విద్యా సంస్థలను కో-ఎడ్యుకేషన్ విద్యాలయాలుగా మార్చాలని ఆదేశాాలు జారీ చేసింది.
Read Also: Tsunami Eruption: సూర్యుడి మధ్యలో పెద్ద రంధ్రం.. హడలెత్తిస్తున్న సౌర సునామీ
ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ప్యానెల్, కో- ఎడ్యుకేషన్ అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ( జనరల్ ఎడ్యుకేషన్), పబ్లిక్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లను, స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ని ఆదేశించింది. కో- ఎడ్యుకేషన్ అమలుపై 90 రోజుల్లోగా కమిషన్ కు నివేదిక సమర్పించాలని కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశించింది. రాష్ట్రంలో కేవలం బాలికలు, కేవలం బాలుర కోసం ప్రత్యేకమైన పాఠశాలలను బంద్ చేయాలని.. వచ్చే ఏడాది నుంచి కో ఎడ్యుకేషన్ అమలు కోసం కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించింది. కో ఎడ్యుకేషన్ సిస్టమ్ అమలు చేయడంతో పాటు.. పాఠశాలక్లలో భౌతిక పరిస్థితులు, మరుగుదొడ్లు, ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచాలని, కో ఎడ్యుకేషన్ సిస్టమ్ పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలిన ఆదేశాల్లో పేర్కొంది. కేరళలో మొత్తం ప్రభుత్వ, ఎయిడెడ్ విభాగాల్లో మొత్తం 280 బాలికల పాఠశాలలు, 164 బాలుర పాఠశాలలు ఉన్నాయి. ఇక ఇవన్నీ వచ్చే ఏడాది నుంచి కో ఎడ్యుకేషన్ పాఠశాలలుగా మారనున్నాయి.