ఇక, పది వేల లోపు ఉన్న అర్చకులకు 10 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడించారు ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. అర్చకులకు న్యాయం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,146 మంది అర్చకులకు జీతాలు పెరుగుతున్నాయని వెల్లడించారు.
సీఎం వైఎస్ జగన్ గ్రాఫ్ పడిపోయింది.. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ ఇంటికి పోవడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు. సీఎం వైఎస్ జగన్‌కు పులివెందులలో ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు
ముందస్తు ఎన్నికలు అన్నది మీడియా చేస్తున్న హడావిడి, కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారం మాత్రమే అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదన్నారు.. ఇప్పటికే చాలా సార్లు చెప్పాం.. ప్రజా తీర్పు ప్రకారం చివరి రోజు వరకు పాలన ఉంటుందని తేల్చేశారు.