రామచంద్రాపురం పంచాయితీపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.. ఎంపీ పిల్లి బోస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీఎంతో జరిగిన సమవేశంలో మంత్రి వేణు గోపాలకృష్ణ తీరుపై ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు బోస్.. నియోజకవర్గంలో మంత్రి వేణు సహా ఆయన వర్గీయుల వ్యవహారశైలిని సీఎంకు పిల్లి సుభాష్ వివరించారు.
ఆదాయాన్నిచ్చే శాఖలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల్లో వివిధ విభాగాల పనితీరును ఈ సమావేశంలో సమీక్షించారు.. విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరుపై ఆరా తీశారు.
నన్ను పవన్ అంటారు, ప్యాకేజీ స్టార్ అంటారు.. దత్త పుత్రుడు అంటారు.. నేను భరించా.. కానీ, ఆయన్ని జగ్గు భాయ్ అంటుంటే వైసీపీ నేతలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జగన్ గారు నుంచి జాగ్గు భాయ్‌కి వచ్చా.. తర్వాత జగ్గు అంటా.. ఆ తర్వాత ఏం అంటానో నాకే తెలియదు.. మీరు నోరు ఎంత జారితే నేను అంత జారుతానని ప్రకటించారు
దేశంలోనే మరో విద్యా విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాంది పలకబోతోంది.. ఈ రోజు జరిగిన వీసీల సమావేశంలో తన విజన్‌ను స్వయంగా ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తొలిసారిగా టీచింగ్, లెర్నింగ్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీస్‌తో అనుసంధానం చేయనున్నారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాల్టీ, అగ్‌మాంటెడ్ రియాల్టీ, మషిన్ లెర్నిగ్, ఎల్‌ఎల్‌ఎం, మెటావర్స్‌తో మిళితం చేయడం టార్గెట్‌గా పెట్టుకున్నారు.
నా దగ్గర సమర్థత లేకపోతే ప్రధాని ఒక ముఖ్యమంత్రితో పాటు సమానంగా నాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారు..? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం వైఎస్ జగన్ గురించి ప్రధాని దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు.