కాలనీలు పూర్తవుతున్నకొద్దీ అన్నిరకాలుగా కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం జగన్.. ఇళ్ల నిర్మాణవేగాన్ని ఇదే రీతిలో ముందుకు తీసుకెళ్లాలన్న ఆయన.. కోర్టు కేసులు కారణంగా ఇళ్లస్థలాలు పంపిణీ నిలిచిపోయిన చోట ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది.. ఈ ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు.
పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే కాలేడు అని జోస్యం చెప్పారు మంత్రి రోజా.. జాతరలో వేపాకు పట్టుకొని ఉగినట్లు ఊగడం తప్ప పవన్ కూ ఏమీ తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం కాదు.. దమ్ముంటే రాష్ట్రం మొత్తంలో 34 మంది అభ్యర్ధులను సొంతంగా పవన్ కల్యాణ్ నిలబెట్టాలి అంటూ సవాల్ విసిరారు
ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది.. ప్రధానితో నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 1.20 గంటలకు పైగా సాగింది.. ప్రధాని మోడీతో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు సీఎం జగన్.
Off The Record: ఉమ్మడి విశాఖ జిల్లాలో గవర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సీనియర్ లీడర్స్ దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ ఈ సామాజికవర్గానికి చెందినవారే. అనకాపల్లి సిట్టింగ్ ఎంపీ భీశెట్టి సత్యవతి, విశాఖ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు కూడా గవర్లే. ఉమ్మడి విశాఖ వరకు నామినేటెడ్ పదవుల్లోనూ వీళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాయి రాజకీయపార్టీలు. ఉత్తరాంధ్రలో ఈ సామాజికవర్గానికి చెందినవారు దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. విశాఖ పశ్చిమ, ఉత్తర, దక్షిణ,…
జగనన్న పాలవెల్లువ పథకంలో మరో విప్లవాత్మక అడుగు పడుతోంది.. పూర్తి స్థాయి నిర్వహణలో ఉన్న సమయంలో దిగ్గజ సంస్థ అమూల్ కి గట్టి పోటీ ఇచ్చిన చిత్తూరు డెయిరీ.. మూతబడితే, దానికి జీవం పోసి పాడి రైతులకు అండగా నిలుస్తూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు.
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆనం రాంనారాయణ రెడ్డి సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి.. గత కొద్ది సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు జయకుమార్ రెడ్డి.
జనసేనాని పవన్‌పై మరోసారి ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు.. పవన్ పంది మీద ఊరేగుతున్న పిచ్చికుక్క.. పెళ్లిళ్ల వీరుడు పవన్ కల్యాణ్.. అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.