ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే చాలు.. ఎక్కడున్నా సరే స్వగ్రామానికి వెళ్లాలి, లేదంటా పెన్షన్ కట్ అవుతుంది అనే టెన్షన్ చాలా మంది వృద్ధులు, ఇతర పెన్షన్ దారుల్లో ఉంటుంది.. పెన్షన్ కోసం ఇతర ప్రాంతల నుంచి స్వగ్రామానికి వెళ్లివచ్చేవారు కూడా లేకపోలేదు.. ఇక, ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటి వరకు గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్…
కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడంతో.. సీఎం సొంత జిల్లా కడపలోని బద్వేల్ నియోజకవర్గంవైపు ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది.. ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సుధను ప్రకటించింది. ఇక, బద్వేల్ ఉప ఎన్నికలపై కసరత్తు ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.. రేపు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలవనున్నారు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ, అభ్యర్థి సుధతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం…
గత టీడీపీ ప్రభుత్వం, హెరిటేజ్‌పై విమర్శలు గుప్పించారు సీఎం వైఎస్ జగన్.. జగనన్న పాలవెల్లువ, మత్స్యశాఖలపై సమీక్ష నిర్వహించారు సీఎం.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం– కార్యదర్శికి మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ- శిక్షణా కరదీపిక పుస్తకాలను ఆవిష్కరించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో సహకార రంగంలోని డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించారని.. కొందరు సహకార డెయిరీలను తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారని ఆరోపించారు.. సహకార…
సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయం విషయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.. ఈ నేపథ్యంలో పవన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… జనసేనానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఒళ్లంతా బురద చల్లుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. తమ పాలిట గుదిబండ అయ్యారని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ పవన్ కల్యాణ్ గురించి…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ సర్కార్, సీఎం, మంత్రులపై చేసిన కామెంట్లు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.. జనసేనానిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు మంత్రులు, వైసీపీ నేతలు.. తాజాగా సినీ దర్శకనిర్మాణ, నటుడు పోసాని కృష్ణ మురళీ కూడా పవన్ కల్యాణ్‌పై పదునైన విమర్శలు చేశారు. అయితే, సోషల్ మీడియా వేదికగా మంత్రి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ.. ఓ పద్యం రూపంలో… “తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు..…
2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మోదీ వేవ్ వీస్తే.. ఏపీలో వైఎస్ జగన్ వేవ్ వీచింది. అత్యధిక పార్లమెంట్ స్థానాలతో బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. సింగిల్ గానే ఆపార్టీ మెజార్టీ మార్క్ దాటడంతో సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మోదీ-షా ద్వయమే కేంద్రంలో హవా కొనసాగిస్తోంది. ఇక ఏపీలో వైసీపీ సరికొత్త రికార్డు సృష్టిస్తూ అధికారంలోకి వచ్చింది. 175 అసెంబ్లీ సీట్లకుగాను ఆపార్టీ ఏకంగా 151సీట్లను తన ఖాతాలో వేసుకొంది.…
ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్‌లో భారీ మార్పులు ఉంటాయనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతూనే ఉంది.. అయితే, ఆ వ్యాఖ్యలకు బరింత బలాన్ని ఇచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేవారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి… ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు ఉంటాయని తెలిపారు. మంత్రి వర్గంలో వందశాతం కొత్తవారినే తీసుకుంటారని సీఎం వైఎస్ జగన్ చెప్పారని తెలిపిన ఆయన.. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎం జగన్‌కు చెప్పానని పేర్కొన్నారు.. ఇక,…
సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దుపై స్పందించిన ఆయన.. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే బెణకని వైఎస్ జగన్ కాలు.. ఢిల్లీ అంటే బెణికిందా..? అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఒక పిరికిపంద అని వ్యాఖ్యానించిన ఆయన.. జగన్ చెప్పిన ప్రత్యేక హోదా ఎక్కడ ఉంది..? కేంద్రాన్ని హోదా అడగకుండా తాడేపల్లిలో తల దాచుకున్నారు అంటూ మండిపడ్డారు. ఏ అంశం పైనైనా టీడీపీ…
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటింది వైసీపీ.. ఇప్పటికే మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక పూర్తి కాగా.. రేపు జడ్పీ ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది.. ఉదయం పది గంటలలోపు ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.. ఉదయం పది నుంచి ఒంటి గంట లోపు స్క్రూటినీ, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, ఎన్నిక ఉండనుండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్షన్ సభ్యుల ప్రమాణస్వీకారం.. మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్, వైస్…