బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఇంకా కొన్ని చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి.. ఇక, నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.. గూడూరు డివిజన్ లోని కోట.. వాకాడు.. చిల్లకూరు.. నాయుడుపేట డివిజన్లోని సూళ్లూరుపేట.. తడ ప్రాంతాల్లో అధిక వర్షం నమోదవుతోంది.. వర్షాలతో మెట్ట పంటలకు ప్రయోజనం కలుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. అయితే,…