ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, పలు కీలక అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రాహుల్ గాంధీతో చర్చిస్తున్నారు. మరోవైపు.. నిన్న తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని ఏఐసీసీ మార్చింది. కొత్త ఇంఛార్జ్ నియామకం నేపథ్యంలో రాహుల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తోందని తెలిపారు. అన్ని జేఏసీ సంఘాలు బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. ఏఐసీసీ పిలుపుతో ఆయన హస్తినకు వెళ్లినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఈరోజు (ఫిబ్రవరి 15) పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్లో కులగణన, ఎస్సీ వర్గీకరణలపై కాంగ్రెస్ నేతలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. Also Read: Rajat…
హైదరాబాద్ జర్నీలో ‘మైక్రోసాఫ్ట్’ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే అని, మైక్రోసాఫ్ట్ కృషితో 500 పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ) బోధన ప్రవేశపెడతాం అని సీఎం చెప్పారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్షిప్ టీమ్‌కు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ నూతన…
కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పించిన తర్వాత ఓట్లు అడగాలి…. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా వేములవాడ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశలంఓ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజి రెడ్డి మాట్లాడుతూ.. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 12 లక్షల 75 వేల పన్ను మినహాయింపు ఇచ్చింది..చాలా మందికి వేసులు బాటు…
పోటీ చేయాలా, వద్దా అనేది త్వరలో చెబుతాం: తలసాని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై ఈ నెల 17 లోపు నిర్ణయం తీసుకుంటామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం అవుతారని చెప్పారు. బీసీ మూమెంట్ చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం బీసీ జనాభా చాలా తక్కువగా ఉందన్నారు. రీసర్వే చేస్తే కేసీఆర్, కేటీఆర్ కూడా పాల్గొంటారని తలసాని చెప్పుకొచ్చారు. ఈనెల 25న…
EVM లోని డేటాని తొలగించొద్దు.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు.. కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈవీఎం నుంచి డేటాను తొలగించవద్దని కోరూతూ దాఖలైన పిటిషన్‌పై, పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల(EVM) స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ఏమిటి అని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఈవీఎంల నుంచి ఎలాంటి డేటా తొలగించవద్దని, ఏ డేటాని రీలోడ్ చేయవద్దని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక…