ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల వద్దే అపేయడంపై బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ మానవత్వం లేకుండా వ్యవహరించిందని ఆమె మండిపడ్డారు. “వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల వద్దే అపేసి ఏ మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న తెలంగాణ పాలకుల తీరును అన్ని వర్గాలూ తప్పుబడుతున్నా ఈ సర్కారు స్పందించడం లేదు. ఆస్పత్రులలో బెడ్స్ కన్ఫర్మ్ చేసుకుని, అందుకు రుజువులు…
లాక్ డౌన్ పై తెలంగాణ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేపటి నుంచి లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి ? అని హైకోర్టు సీరియస్ అయింది. కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన లేకుండా ఇంత సడెన్ నిర్ణయం ఏంటి ? అని నిలదీసింది. ఇతర ప్రాంతాల వాళ్ళు తక్కువ టైమ్ లో ఎలా వెళతారు ? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు మీకు…
తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ ఉండనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. క్యాబినెట్ నిర్ణయాలు : ■మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల…
తెలంగాణలో కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో కెసిఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ ఉండనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు లాక్ డౌన్ నిర్ణయం…
కరోనా పరీక్షలు తగ్గడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. నైట్ కర్ఫ్యూ నిబంధనలు ఎక్కడ అమలు కావడం లేదని.. రాత్రి 1 గంటలకు ఫుడ్ దొరుకుతుందని హైకోర్టు సీరియస్ అయింది. నిబంధనల ఉల్లంఘనపై మాకు లేఖలు, ఇమెయిల్స్ వస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. సరిహద్దుల్లో అంబులెన్స్ లను అడ్డుకోవడం దారుణమని…మీకు ఎవరు చెప్పారు.. అంబులెన్స్ లను అడ్డుకోవాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్స్ లను అడ్డుకోవడంపై వివరాలు కోరిన హైకోర్టు..పాతబస్తీలో…
కరోనా మహమ్మారి విజృభిస్తున్నప్పటి నుండి ఇప్పటివరకు తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. దేశం మొత్తంలో దాదాపు పదిహేను రాష్ట్రాలలో జర్నలిస్టులను “ఫ్రంట్ లైన్ వారియర్స్ ” గా గుర్తించారని… వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వాలు చేయిస్తున్నాయని వెల్లడించారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇతర రాష్ట్రాలు ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నాయని… కాబట్టి కరోనాతో మృతి చెందిన…
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో ఆక్సీజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, బెడ్లు, ఇతర కరోనా సౌకర్యాల పరిస్థితి గురించి అధికారులను సీఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు పలు సూచనలు చేశారు. సీఎం కేసిఆర్‌తో ఫోన్లో మాట్లాడిన హర్షవర్థన్ ప్రధానితో చర్చిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సమీక్షా సమావేశానంతరం…
నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని, ఎంతో స్వచ్ఛమైనదని సిఎం అన్నారు. ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నోసుగుణాలను మనం తల్లినుంచే నేర్చుకుంటామని, ఒక మనిషి ఎదుగుదలకు మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకమని సిఎం తెలిపారు. మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అరెస్ట్ అయ్యారు. జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధును భీమవరంలో అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే పుట్టమధును ఏ కేసులో అరెస్ట్ చేశారో పోలీసులు మాత్రం చెప్పలేదు. ఏ కేసులో పుట్ట మధును అరెస్ట్ చేశారో చెప్పడానికి పోలీసులు నిరకరించినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. గత కొన్ని రోజులుగా పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్నారు. నిన్న మధు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో…
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా మహమ్మారిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సంచారం. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటె, గతనెల 19 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన…