ఈ నెల 18వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ ఏంపీలకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు.కాగా.. కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయమై పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిలదీసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. గత సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్…
గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. భద్రాచలం దగ్గర క్రమంగా గోదావరిలో నీటి ఉధృతి పెరుగుతోంది.. గోదావరి పరివాహక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి.. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం ఇప్పటికే 70 అడుగులకు చేరువైంది.. మరింత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది.. భద్రాచలానికి వెంటనే హెలికాప్టర్, అదనపు రక్షణ సామగ్రి తరలించండి అంటూ సీఎస్ సోమేష్ కుమార్‌ను ఆదేశించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. భారీ వానలతో గోదావరి ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తున్న ప్రకృతి విపత్తు నేపథ్యంలో,…
తెలంగాణ రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో.. ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా.. 64 ఏళ్ల రికార్డ్‌ను బద్దలుకొడుతూ వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు. 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో.. అధికారులు 17 గేట్లు ఎత్తి మూడు లక్షల క్యూసెక్కుల నీరుని…