ఉద్యమ సమయంలో మహబూబాబాద్ వచ్చాను అప్పటి పరిస్థితి చూసి కన్నీళ్ళు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్ లో.. దారుణమయిన కరువు ఉండేదని తెలిపారు. పరిస్థితి చూసి కన్నీళ్ళు పెట్టుకున్నానని గుర్తుచేసుకున్నారు సీఎం. వర్ధన్నపేట, పాలకుర్తిలో సగం పూర్తి అయిన కాలువలు చూసి ఈ జన్మలో నీళ్ళు రావనుకున్నాను కానీ..కురవి వీరభద్రుడికీ మొక్కుకున్నా అని అన్నారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా జనవరి నెలలో నూతనంగా మరో 3 సమీకృత జిల్లా కలెక్టరేట్లు ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 18వ తేదీన ఖమ్మం జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
Off The Record: తెలంగాణలో గులాబీపార్టీ నేతల చూపంతా ప్రస్తుతం 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభపైనే ఉంది. టీఆర్ఎస్– బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డితోపాటు మరికొందరు సభా ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. దాదాపు ఐదు లక్షల మందిని సమీకరించాలనేది పార్టీ లక్ష్యం. అప్పుడే బీఆర్‌ఎస్ సభ దేశం దృష్టిని ఆకర్షిస్తుందని గులాబీ నేతల ఆలోచన. నియోజకవర్గాల వారీగా జనసమీకరణకు ప్రణాళికలు…
తెలంగాణ కొత్త సీఎస్ ఎవరన్నది ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్ గా మారింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి నెలకొంది. డీఓపీటీ ఆదేశాల మేరకు సోమేశ్‌కుమార్‌ను విధుల నుంచి తప్పించి కొత్త సీఎస్‌ని కూడా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.
Off The Record: టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత మొదటిసారి బహిరంగ సభకు రెడీ అవుతోంది. మొదట్లో దేశ రాజధాని డిల్లీలో బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నారు. అయితే తొలిసభ తెలంగాణలోనే అట్టహాసంగా నిర్వహించి ప్రయాణం మొదలుపెట్టాలని డిసైడైంది. ఈ నెల 18న ఖమ్మంలో 5 లక్షల మందితో సభ పెట్టి దేశం దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నారు గులాబీ నేతలు. తెలంగాణలోపాటు ఏపీ సరిహద్దు నియెజకవర్గాల్లోని ప్రజలను సభకు సమీకరించాలనేది పార్టీ నిర్ణయం.…