తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కరీంనగర్‌లో పర్యటించారు. ఇటీవల బీసీ సంక్షేమం, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మృతిచెందడంతో వారి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించారు.
Harish Rao: ఈ నెల 18న బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం వేదికగా భారీ బహిరంగసభను నిర్వహిస్తోంది. సభకోసం మంత్రలు ఖమ్మం జిల్లాలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రమంత్రి హరీష్ రావు శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్రవీరయ్య, రెడ్యానాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Union Minister Kishan Reddy criticizes CM KCR and KTR: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. తండ్రిని, కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని కేటీఆర్ లా మంత్రి కాలేదని, కష్టపడి పైకొచ్చామని అన్నారు. కేసీఆర్ కన్నా దిగజారి కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీని విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అని అన్నారు. బీఆర్ఎస్ నేతలు మిడిమిడి జ్ఞానం, తప్పుడు ఆలోచనతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎవరూ బయటకు రాని సమయంలో…
Minister Harish Rao criticizes BJP: బీజేపీని నమ్మి ఆ పార్టీలో చేరితే ఆత్మహత్య చేసుకున్నట్లే అని అన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో స్థానం లేదని అన్నారు. ఈనెల 18న ఖమ్మంలో టిఆర్ఎస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. శనివారం ఇల్లందులో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. బీజేపీలో చేరితే వారు రాజకీయాలకు దూరం అయిపోయినట్లే అని, వారికి రాజకీయ భవిష్యత్తు…