తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇవాళ యాదాద్రిలో పర్యటించనున్నారు.. ఉదయం 10.30 గంటలకు రోడ్డు మార్గంలో యాదగిరి గుట్టకు బయల్దేరి వెళ్లనున్నారు సీఎం దంపతులు.. ఉదయం 11.30 గంటలకు యాదాద్రికి చేరుకోనున్న ఆయన.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఇక, ఆలయ ‘విమాన గోపురం’కు బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. ఇక, తన పర్యటనలో భాగంగా క్షేత్రంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిని…
సీఎం కేసీఆర్ నేడు యాదాద్రిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో యాగశాల కోసం ఎంపిక చేసిన స్థలం, ఆలయ పట్టణాన్ని మూడు నిమిషాల పాటు విహంగ వీక్షణం చేశారు. పెద్దగుట్టలోని హెలిప్యాడ్‌లో దిగే ముందు ముఖ్యమంత్రి యాదాద్రిని ఏరియల్ సర్వే చేసి యాగశాలకు ఎంపిక చేసిన స్థలం, ప్రెసిడెన్షియల్ సూట్‌లు, కొండవీటివాగు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పెద్దగుట్ట హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత,…
యాదాద్రి పుణ్యక్షేత్రం పునః ప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్‌స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం యాదాద్రిలో పర్యటించారు. దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులతో పాటు పరిసరాలన్నింటినీ పరిశీలించారు. పెంబర్తి కళాకారులు తయారుచేసిన ప్రధానాలయ ద్వారాలను సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాంగణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను వెంట ఉన్నవారికి వివరించారు.…