మేడారం మహా జాతర మూడవరోజుకి చేరుకుంది. వనమంతా జనంగా మారిపోయింది. ఇవాళ సెలవు రోజు కూడా కావడంతో భక్తులు మేడారంకి పోటెత్తుతున్నారు.ఈ మేడారం మహాజాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేసింది. ఇవాళ సమ్మక్క-సారలమ్మను తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శించుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో మేడారంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతర బందోబస్తు కోసం 382 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో నిఘా…