విజయవాడలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై రాయి దాడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు సతీష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు బెజవాడ పోలీసులు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. ఇక, రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు పేర్కొన్నారు పోలీసులు.. సీఎంను హత్య చేశాలన్న ఉద్దేశ్యంతోనే దాడి చేశారని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ కేసులో మరిన్ని కీలక అంశాలను బయటపెట్టారు.