ఈ సందర్భంగా సీఎం జగన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. మీ అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. ఆ దేవుని చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని సీఎం జగన్ తెలిపారు. రాష్టాభివృద్ది కోసం అందరూ ప్రార్థించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో విజయవాడ NIA కోర్టులో ఇవాళ ( సోమవారం ) విచారణ జరిగింది. సీఎం జగన్ తరపున లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఎన్ఐఏ పలు అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని.. అలాగే కుట్ర కోణంపైనా దర్యాప్తు చేయలేదని.. కాబట్టి తదుపరి దర్యాప్తు అవసరం ఉందని వాదించారు.
విజయవాలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం హాజరుకానుంది.