ఎన్నికల ప్రచారంలో వైస్సార్సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు దూసుకుపోతున్నారు. ప్రతి గడప గడపకు తిరుగుతూ... మరొక అవకాశం ఇవ్వాలని కోరుతూ... ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ.. ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి, మరొకసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని జగన్మోహనరావు కోరుతున్నారు. పూలతో, హారతులతో మహిళలు, ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55 డివిజన్లో ఎంపీ కేశినేని నాని కుమార్తె.. కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ.. వైసీపీకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల నుంచి పేద ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు, అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారని.. ఎంతమంది కూటమి పార్టీలన్నీ గుంపుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి…
అమరావతిలో వైసీపీ పార్టీలో భారీ చేరికలు జరుగుతున్నాయి. ఇటీవల ముస్లిం మైనారిటీ సోదరులు భారీ ఎత్తున పార్టీలో చేరగా.. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన 35 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువాలు కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో జరిగిన అభివృద్ధికి, ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి తేడా చూడాలని కోరారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అందరికీ అభివృద్ధితో పాటు సంక్షేమం…
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవెల్లి మండలం భైరవపట్నం గ్రామంలో ముదినేపల్లి మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు.. KDCC బ్యాంక్ చైర్మన్ తాతిలేని పద్మావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరావు మాట్లాడుతూ.... జగనన్న రెండు రోజుల్లో విడుదల చేసే మేనిఫెస్టోను మన కార్యకర్తలు ప్రజల దగ్గరికి తీసుకువెళ్లాలని సూచించారు. అంతేకాకుండా.. అక్కా చెల్లెలు గ్రామాల్లో తిరిగి మన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించాలని…
పార్లమెంటులో జాతీయ రహదారుల కోసం గళ మెత్తింది నేనే.. జాతీయ రహదారుల కోసం పార్లమెంటులో గళ మెత్తింది నేనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ పట్టణం లోని అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలసి బోయినిపల్లి వినోద్ కుమార్ ప్రచారంలో మాట్లాడుతూ.. కరీంనగర్ కు ఎంపీగా స్మార్ట్ సిటి పనులకోసం రూ.1000 కోట్లు అభివృద్ధి పనులు తీసుకచ్చిన అన్నారు. మళ్లీ కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి యాలని ఉందన్నారు.…
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు పులివెందులలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు ఏపీలోని పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు చివరి రోజు నామినేషన్ వేశారు. రెండు రాష్ట్రాల్లో ప్రచారం జోరు పెంచారు.…
గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. మంగళవారం పొదిలి మండలంలోని ఓబులక్కపల్లి, కొండాయపాలెం, సలకనూతల, దొడ్లేరు, మూగచింతల, భట్టువారిపాలెం, మాదిరెడ్డిపాలెం, నందిపాలెం గ్రామాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను కలిసి స్పీకర్‌పై బీజేపీ నేతలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాధవి లత కంప్లైంట్ చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలువడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తుందన్నారు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, కాంగ్రెస్ చేవెళ్ల అభ్యర్థి రంజిత్…
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు వైసీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం ఏ విధంగా వీస్తుందో.. రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పార్టీ చూడం, కులం చూడం.. జగనన్నకు మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు.