ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ఎన్జీవో నేతలు బండి శ్రీనివాస్, శివారెడ్డి తదితర ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఎపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేబినెట్లో 12వ పీఆర్సీ ప్రకటించినందుకు సీఎం జగన్ కు కృతజ్ణతలు తెలిపామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలిచ్చే విషయంలో సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చెప్పారన్నారు. జీపీఎస్ ద్వారా గత ప్రభుత్వం 32శాతంతో ఫిట్ మెంట్ తో 50 శాతం తీసుకు వచ్చి ధరలతో పాటు పెన్షన్ ఇస్తామని సీఎం చెప్పారన్నారు. ఉద్యోగుల నుంచి కాంట్రిబ్యూషన్ లేని పెన్షన్ ఇవ్వాలని సీఎంను కోరామని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. ‘ కాంట్రిబ్యూషన్ లేని విధానం వల్ల ప్రభుత్వానికి రమవుతుందని సీఎం చెప్పారు. మేము ప్రభుత్వానికి అమ్ముడు పోలేదు. సీపీఎస్ రద్దు చేసే వరకు పోరాడతాం ,వెనుకాడేది లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి మేము సహకరిస్తున్నాం.
Free Current: గుడ్ న్యూస్.. వారందరికీ 200యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్
కాంట్రి బ్యూషన్ లేని విధానాన్ని తీసుకు వచ్చేలా కృషి చేస్తాం. సీపీఎస్ రద్దు అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వం సదుపాయాలను కల్పిస్తుంది దాన్ని మేము స్వాగతిస్తున్నాం. భవిష్యత్తులో కాంట్రిబ్యూషన్ను కూడా తీసేస్తామని ప్రభుత్వం చెప్పొచ్చు. జీపీఎస్ లో ఈ మేరకు ఉద్యోగులతో ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంటుంది. జీపీఎస్ లో ఉద్యోగికి నష్టం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. పీఆర్సీ ఛైర్మన్ నియామకంపై సీఎం వద్ద చర్చ జరగలేదు. పీఆర్సీ ఛైర్మనుగా ఎవరిని నియమించినా మాకు అభ్యంతరం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించడంలో మంత్రివర్గ సభ్యులు సీఎస్ జవహర్ రెడ్డి కృషి చేశారు వారికి ధన్యవాదాలు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 25 ఏళ్లుగా పనిచేసినా చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి గతంలో ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించినందుకు సీఎంకు ధన్యవాదాలు. ఏపీ వైద్య విధాన పరిషత్ లాంటి సంస్థ సహా మెడికల్ డిపార్టుమెంట్లో పనిచేసే ఉద్యోగులకు 010 ద్వారా ఇచ్చేలా సీఎం చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు తీసుకున్న సీఎంకు ధన్యవాదాలు తెలిపాం. అన్ని జిల్లాల్లో ఒకే హెచ్ఆర్ఎ ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు.’ తెలిపారు.
CPI Ramakrishna : ప్రథమచికిత్సకు పూర్తిస్ధాయి గుర్తింపు అవసరం