శ్రీకాకుళం : డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో క్రీడలు ఎంతో దయనీయస్థితిలో ఉండేవని… ప్రస్తుతం క్రీడలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియ జేశారు. క్రీడలు నేటికీ నిరాదరణకు గురవుతున్నాయనేది తన వ్యక్తిగత అభిప్రాయమని… ఈ విషయం పై ఎవరు ఏమనుకున్నా పర్వాలేదన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని… వైద్యం కోసం వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు.…