“వక్ఫ్ బిల్లు”పై పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌గా జగదాంబికా పాల్ నియామకం.. వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాలని’ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లుని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగంపై దాడిగా, మతస్వేచ్ఛని హరిస్తున్నాయంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఈ బిల్లుపై ఆందోళన చేశాయి. దీంతో ఈ బిల్లుని చర్చించేందుకు ‘‘ జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ని నియమించింది. 21 మంది అధికార, ప్రతిపక్షకు చెందిన లోక్‌సభ ఎంపీలను, 10…
ఇన్స్టాగ్రామ్ యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. సూసైడ్ నోట్ రాసిన శ్రీహరి . ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తను కూడా ఆమెను ప్రేమించానని.. కానీ తేజస్విని చనిపోయిందని తెలిపాడు. నేను కూడా తనదగ్గరకు వెళుతున్నా అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యాశాఖపై…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ అయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించారు. గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటిస్తోన్న నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో సమావేశం అయింది.
పారిశ్రామిక పాలసీ రూపకల్పనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దేశంలో టాప్ 5 రాష్ట్రాలతో పోటీపడేలా కొత్త పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలని అధికారులను ఆదేశించారు. పాలసీ రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. సంబంధిత ₹3,01,116/- రూపాయల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సచివాలయంలో అందజేశారు.
వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరం సర్టిఫికెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంగవైకల్యంతో బాధపడేవారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నామని.. సదరం ఫేక్ సర్టిఫికేట్ల జారీపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం ఆరున్నర గంటలకు అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
భక్తులకు శుభవార్త.. విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే అవకాశం.. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు ఆలయ నిర్వహాకులు శుభవార్త తెలిపారు. సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ కొండపైనున్న విష్ణు పుష్కరిణిలో భక్తులకు సంకల్ప స్నానం ఆచరించే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రావణ మాసం మొదటి ఆదివారం యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య చేతుల మీదుగా అధికారులు విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించారు. ఆలయ అధికారులు…
తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏది జరిగినా జగన్‌పై నెట్టేసి తప్పుకోవాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడంతో.. తుంగభద్ర నుంచి 90,000 క్యూసెక్కుల నీరు బయటకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనివల్ల కొన్ని జిల్లాలకు వరద ముంపు ఏర్పడిందన్నారు.