సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల ఎజెండాలకు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై కేబినెట్లో చర్చ జరిగింది. జనవరి 8న ప్రధాని మోడీ వైజాగ్ రానున్నారు. వైజాగ్ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇక, కేబినెట్ సమావేశం…
రెవెన్యూ సదస్సుల నిర్వహణపై మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ పాపాల కారణంగా రాష్ట్రంలో విపరీతంగా భూ సంబంధ సమస్యలు పెరిగిపోయాయి.. రెవెన్యూ సదస్సులకు వస్తున్న అర్జీలే ఇందుకు తార్కాణంగా పేర్కొన్నారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.. పలు కీలక అంశాలపై చర్చించారు.. కొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేబినెట్.. అయితే, సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. పాలనా అంశాలు కొద్దిసేపు ముచ్చటించారు.. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపైన చర్చించారు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసే అంశంపై చర్చించారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల ఎజెండాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై కేబినెట్లో చర్చ జరిగింది. జనవరి 8న ప్రధాని మోడీ వైజాగ్ రానున్నారు. వైజాగ్ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.…
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంద్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. 14 అంశాలు ఎజెండాగా క్యాబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం అయింది. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అంశాలే ప్రధాన అజెండాగా భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2,700 కోట్ల రూపాయలు విలువ గల రెండు ఇంజరీనింగ్ పనులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్కు కేబినెట్…
ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం అనంతరం గడిచిన ఆరు నెలల పాలన, రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులపై మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. కేబినెట్ భేటీలో చర్చించే అంశాలు ఏంటో చూద్దాం. ఎస్ఐపీబీ అమోదించిన లక్ష 80 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ అమోదం తెలపనుంది. ఈ పెట్టుబడుల ద్వారా…
న్యూ ఇయర్ వేడుకలపైకి దూసుకెళ్లిన కార్, కాల్పులు.. 10 మందికి పైగా మృతి..! అమెరికాలో న్యూ ఓర్లీన్స్లో విషాద ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ రోజున జనంపైకి ఓ వ్యక్తి కారును పోనిచ్చాడు. పికప్ ట్రక్ జనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. నిందితుడైన వ్యక్తి జనాలపైకి కాల్పులు జరిపినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. బోర్బన్ స్ట్రీట్, ఐబెర్విల్లే కూడలిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనాలపైకి ట్రక్ దూసుకెళ్లింది. ఈ సంఘటన తెల్లవారుజామున 3:15 గంటల…
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ అమ్మవారిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శన అనంతరం పండితులు సీఎంకు వేదాశీర్వచనాలు చేసి.. తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు సీఎం చంద్రబాబుకు అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు రాగా.. ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు.. తెలుగు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ఏపీ ప్రజలు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ నూతన ఏడాది అన్నం పెట్టే అన్నదాతల జీవితంలో సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరారు. ఈ మేరకు ప్రతిఒక్కరు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. ‘రాష్ట్ర ప్రజలు నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం…
ఏడాది బాలున్ని ఎత్తుకెళ్లిన గ్యాంగ్.. అమ్మేసి.. సొమ్ము చేసుకున్న వైనం వికారాబాద్ జిల్లాలో డబ్బు కోసం ఏడాది బాలున్ని ఎత్తుకెళ్లిన గ్యాంగ్ మగపిల్లలు లేని వ్యక్తికి అమ్మేసి.. సొమ్ము చేసుకున్నారు. నిందితులు విక్రయించిన బాలున్ని స్వాదీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించడంతో తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కథను కరణ్ కోట్ పోలీసులు సుఖాంతం చేశారు. తాండూరు రూరల్ సీఐ నగేష్ కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డితో కలిసి కేసు వివరాలను…