కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. సీఎం చంద్రబాబుకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కృష్ణారెడ్డి, సుధారెడ్డిలు స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు రాజ్యసభ అభ్యర్థులు.. రాజ్యసభకు టీడీపీ నుండి ఎంపికైన బీదా మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుండి ఎంపికైన ఆర్.కృష్ణయ్య.. ఈ రోజు మంగళవారం సీఎం చంద్రబాబును కలిశారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఆకాక్షించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 1998లో విద్యుత్ రంగ సంస్కరణలు తీసుకొచ్చాం.. 2004కి మనం పవర్ వినియోగంలో పొదుపులో ఉన్నాం.. విద్యుత్ రంగంలో ఏపీని మొదటి ర్యాంకు కు తెస్తాం టీడీపీ హయాంలోనే అన్నారు సీఎం చంద్రబాబు..
Urjaveer : ఇంధన సామర్థ్యం, సుస్థిరతను పెంపొందించే ప్రయత్నాలలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వ PSUల క్రింద ఒక JV అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) సహకారంతో, వ్యక్తులకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఉర్జవీర్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన-సమర్థవంతమైన ఉపకరణాలను ప్రోత్సహించడానికి, విక్రయించడానికి, ఆర్థికాభివృద్ధితో పాటు శక్తి, పర్యావరణ పరిరక్షణ రెండింటికీ దోహదపడుతుంది. కృష్ణా జిల్లా పోరంకిలో శనివారం ఉర్జవీర్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉర్జవీర్‌లో భాగంగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌లకు ఎలక్ట్రికల్…
టెక్నాలజీ మన జీవితంలో భాగమైపోయిందన్నారు సీఎం చంద్రబాబు.. టెక్నాలజీ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతోందన్న ఆయన.. సాంకేతికతతో అనేక మార్పులు వస్తున్నాయన్నారు.. ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చాలని అనుకుంటున్నాం అన్నారు.. ఇప్పుడు డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణగా అభిర్ణించారు.. ఇక, ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త, ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలనే నినాదం తీసుకున్నామని వెల్లడించారు ఏపీ సీఎం..
పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 26 జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు విశాఖపట్నం రానున్నారు.. ఈ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్రఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ముంబైలోని ఆజాద్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్.. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా విశాఖ రానున్నారు..
మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం వివిధ అంశాలపై మంత్రులతో చర్చించారు.. బియ్యం, భూ దురాక్రమణ మాఫీయా ప్రభుత్వానికి సవాల్ విసురుతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. అన్నింటినీ అరికాడతామని స్పష్టం చేశారు.. కాకినాడ పోర్ట్ ను బలవంతంగా లాక్కొనారు.. కాకినాడ సెజ్ కూడా లాగేసుకున్నారు.. పోర్ట్ లాగేసుకుని 41 శాతం కేవీ రావుకు ఇచ్చేసి 59 శాతం అరబిందో వాళ్లు లాక్కొన్నారని ఆరోపించారు.. ఆస్తులను లాగసుకోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్... ఇంతకు ముందు మనం ఎప్పుడూ చూడలేదన్నారు…
రాజధాని అమరావతి పునర్నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఇదే సమయంలో.. అమరావతి నిర్మాణానికి విరాళాలు కూడా స్వీకరిస్తున్నారు.. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె పి విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి రూ. కోటి విరాళంగా అందించారు.
పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ వెల్లడించిన ప్రకారం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర జల శక్తి శాఖ, పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాన్ని హెచ్చరించింది.