ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు.. ముఖ్యంగా రాష్ట్రంలో పాలనా వ్యవహారలపై సీఎం ప్రత్యేకంగా సమీక్ష చేయనున్నారు.. ఫైళ్ల క్లియరెన్సు, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్, ఇతర పాలనాపరమైన అంశాలపై సమీక్షించనున్నారు..