SHANTI Bill: ‘‘అణు రంగం’’లోకి ప్రైవేట్ సంస్థల్ని అనుమతించడానికి కేంద్రం తీసుకువచ్చిన ‘‘శాంతి బిల్లు’’కు లోక్‌సభ ఈ రోజు(బుధవారం) ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ బిల్లు 2047 నాటికి 100 గిగా వాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.