వేసవి సీజన్ వచ్చేసింది. వేసవిలో ప్రతిఒక్కరూ ఫ్రిజ్ కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తారు. ఫ్రిజ్‌లోని నీరు తాగాలని ఆరాటపడతారు. అయితే అలాంటి వారికి మట్టికుండ విలువ తెలియదు. సాధారణంగా మట్టికుండను పేదవాడి ఫ్రిజ్ అంటారు. మట్టికుండలో నిల్వ చేసిన నీళ్లు అమృతంలా ఉంటాయని మన పెద్దలు ఇప్పటికీ చెప్తూనే ఉంటారు. పూర్వకాలంలో మట్టికుండలోని నీళ్లను మాత్రమే అందరూ తాగేవారు. అందుకే అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్లు. కాలం మారే కొద్దీ మట్టి కుండలు కాకుండా జనాలు రిఫ్రిజిరేటర్లకు అలవాటు…