Home
Cjp
Cjp News
-
CJP: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సరిపోదు.. మరో రెండు డిమాండ్లు నెరవేర్చాలని సీజేపీ పట్టు
CJP: నీట్ వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన రాజీనామా లేఖను పంపినట్లు ఆయన ఒక ట్వీట్లో తెలిపారు. దేశ యువతను ఉద్దేశించి రెండు పేజీల ప్రకటనను సైతం పోస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ పట్టుబట్టుకుని కూర్చింది. ఈ రాజీనామాతో నిరసనలు ఇంతటితో ఆగిపోతాయని… -
Dharmendra Pradhan Resigns: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
Dharmendra Pradhan Resigns: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సీజేపీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న వరుస నిరసనలు, ధర్నాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. యువత ఆకాంక్షలను గౌరవించే నిర్ణయమే ఇదని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దేశంలో నీట్ (NEET) సహా పలు పోటీ పరీక్షల పేపర్ లీక్… -
Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
Jantar Mantar: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసన వేదికపై నుంచి ఉత్తరాఖండ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేర్ సింగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. తన భుజానికి ఉన్న బ్యాడ్జీని తీసేసి, అభిజిత్ దీప్కేకు అప్పగించాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న నిరసనకారులు అతడిని పొగుడుతూ, చప్పట్లతో నినానాలు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. షేర్ సింగ్ ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నాడని, అతడిపై క్రిమినల్… -
Abhijeet Dipke: వాంగ్‌చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
Abhijeet Dipke: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేంత వరకు విద్యార్థుల పోరాటం ఆగేదే లేదని 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దిప్కే తీవ్ర స్థాయిలో స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి చర్చలకు ప్రయత్నించినా, ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన ఆమరణ నిరాహార దీక్షను విరమించినా.. తమ ఉద్యమ ప్రధాన డిమాండ్‌లో ఎలాంటి మార్పూ ఉండబోదని తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప… -
CJP Protests: మా 4 డిమాండ్లలో రెండింటికి కేంద్రం అంగీకారం.. ఆందోళనపై CJP తాజా ప్రకటన..
CJP Protests: నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరోసారి స్పష్టం చేసింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దిప్కే మాట్లాడుతూ, ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేసే వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనలను విరమించబోమని ప్రకటించారు. అయితే, 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనం… -
CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
CJP Protest: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షకు ముగింపు పలికారు. గురుగ్రామ్‌లోని మెడాంతా ఆస్పత్రిలో గురువారం రాత్రి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, లేహ్-లడఖ్ అపెక్స్ బాడీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన దీక్ష విరమించారు. ఈ విషయాన్ని వాంగ్‌చుక్ స్వయంగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. వాంగ్‌చుక్ తన ప్రకటనలో, పలువురు అంశాలపై సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు జరిగిన… -
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
CJP Protest: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. యువత కూడా జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనకు వస్తున్నారు. సోమవారం పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు, నిరసనకారులకు మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో రెండు వర్గాలు గాయపడ్డాయి. ఈ ఉద్యమంలో ప్రధాన ఎజెండా పేపర్ లీకుల నుంచి విషయం తప్పుదారి పడుతున్నట్లు కనిపిస్తోంది. ఉద్యమంలో యువత పాల్గొంటున్నప్పటికీ, వారితో పాటు… -
CJP: కాక్రోచ్ ఉద్యమం ఎటు పోతోంది.? పేపర్ లీక్‌పై నిరసన అయితే దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు.?
CJP: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తోంది. నీట్ పేపర్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల వంటి ప్రతిపక్షాలు కూడా ఆయన దిగిపోవాల్సిందే అని అల్టిమేటం విధిస్తున్నాయి. ఇదిలా ఉంటే, విద్యార్థుల భవిష్యత్తు కోసం సీజేపీ కానీ ఇతర ఏ పార్టీ అయిన కానీ నిరసన తెలపడం మంచి విషయమే. అయితే, ఈ… -
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
Supreme Court: పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. "మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు, అంత సమయం కూడా లేదు" అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్యానిస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలపై జోక్యం చేసుకోవాలన్న అభ్యర్థనను తోసిపుచ్చారు. బుధవారం నాటి విచారణలో ఓ లాయర్ ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం… -
CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
CJP Protest: ఢిల్లీ వేదికగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) చేపట్టిన నిరసనలు నేటితో 32వ రోజుకు చేరుకోగా, ఉద్యమకారులు తమ డిమాండ్ల జాబితాను మరింత విస్తరించారు. జూలై 20న జరిగిన నిరసనల్లో పాల్గొన్న శాంతియుత ఉద్యమకారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదని, వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని తాజాగా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడిన పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా.. "శాంతియుతంగా…
తాజావార్తలు
-
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’లో నాని లుక్ లీక్.. సెట్స్ నుంచి బయటికి వచ్చిన వీడియోలు!
-
Amit Shah : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే గెలవబోతోంది
-
Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
-
GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై వైసీపీ అనుమానం.. రేపే ఓట్ల లెక్కింపు
-
Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!