CAA: పౌరసత్వ సవరణ చట్టం(CAA) కింద మొదటిసారిగా 14 మందికి పౌరసత్వ ధృవీకరణ పత్రాలను జారీ చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా సర్టిఫికేట్లను అందించారు.
CAA: భారత్ అమలు చేయనున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు కామెంట్స్ చేస్తున్నాయి. భారత అంతర్గత విషయాల్లో ఎక్కువగా కలుగజేసుకుంటున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి హక్కుల విభాగాలు ఈ చట్టం అమలును మతవివక్ష అంటూ వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే, ఇందులో ముస్లింలను మినహాయించడంపై పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Amit Shah: భారత ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని అమలు చేస్తోంది. డిసెంబర్ 31, 2014కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, పార్సీలు, బౌద్ధులు, సిక్కులు ఇలా ముస్లిమేతరులకు ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వం లభించనుంది. అయితే, ఈ చట్టంలో ముస్లింలను ఎందుకు మినహాయించారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ రోజు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రహోంమంత్రి మాట్లాడుతూ.. ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు.