అనుకున్నంత అయింది. ఇప్పటివరకు నెమ్మదిగా సినిమాల రిలీజ్ డేట్‌ల మీద, సినిమాల అనౌన్స్‌మెంట్ల మీద పెత్తనం చెలాయిస్తూ వచ్చిన ఓటీటీ (OTT) సంస్థలు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాయి. ఇప్పటివరకు ఓటీటీ సంస్థలు ఒక సినిమాని దాదాపుగా అవుట్ రేట్‌కి కొనేసేవాళ్ళు. అంటే, కాంబినేషన్ బట్టి లేక మరే ఇతర క్రేజ్‌నో బట్టి ఒక సినిమాకి పది కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే, ఆ పది కోట్లు కట్టాల్సిందే. అడ్వాన్స్‌గా కొంత కట్టి, సినిమా ఓటీటీలో…