గత 18 రోజులు గా జరిగిన సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడింది. అనేక చర్చలు, వాదనలు, సవాల్ లతో గత పద్దెనిమిది రోజులుగా జరుగుతున్న టాలీవుడ్ సమ్మె విషయంలో చివరికి తెలంగాణ ప్రభుత్వం చొరవతో అందరికి ఆమోదయోగ్యమైన ఫలితం వచ్చింది. నిర్మాతలు , ఫెడరేషన్ నాయకుల తో కార్మికశాఖ అదనపు కమిషనర్ జరిపిన చర్చలు చర్చలు విజయవంతం అయ్యాయి. రెండు వేల లోపు కార్మికులకు మూడు సంవత్సరాలకు 22.5 శాతం వేతనాలు పెంచేలా నిర్ణయించారు.…
టాలీవుడ్ సిని కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. వారం రోజుల్లో ముగుస్తుందనుకున్న ఈ సమ్మె మూడు వారాలుగా సాగుతూనే ఉంది. కానీ పరిష్కారం అయితే లభించలేదు. ఈ నేపధ్యంలో సినీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకోనుంది. నిన్న సినీ కార్మిక సమ్మె పై ఫిల్మ్ ఛాంబర్ తో ఫెడరేషన్ తో చర్చించిన ప్రభుత్వ ఉన్నతాధికారుల పలు సూచనలు చేసారు. ప్రభుత్వం చేసిన సూచనల పట్ల ఫెడరేషన్ నాయకులు సుముఖంగా ఉన్నట్టు సమాచారం.…