నేపాల్‌లోని సోలుకుంబు నుంచి ఖాట్మండుకు ప్రయాణిస్తున్న సమయంలో ఐదుగురు విదేశీ పౌరులతో సహా ఆరుగురితో కూడిన హెలికాప్టర్ ఈ రోజు అదృశ్యమైంది. 9ఎన్‌ఎండబ్ల్యూ కాల్ గుర్తుతో ఉన్న ఛాపర్ ఉదయం 10:15 గంటలకు కంట్రోల్ టవర్‌తో సంబంధాన్ని కోల్పోయింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెనుప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్తర బెంగాల్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది.
హెలీకాఫ్టర్ల ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రులు వాడే హెలీకాఫ్టర్ ఖరీదు మరింత ఎక్కువ. వారి భద్రతకు అనుగుణంగా ఉండే హెలీకాఫ్టర్లను కొనుగోలు చేస్తుంటారు. రాజస్తాన్ ప్రభుత్వం 2005లో వసుంధర రాజే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి ట్ఇన్ ఇంజిన్ 109 ఈ హెలీకాఫ్టర్‌ను కొనుగోలు చేశారు. వసుంధరా రాజే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ హెలీకాఫ్టర్‌ను వినియోగించారు. ఆ తరువాత అధికారం మారింది. అశోక్…