ఏపీ టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మంగళవారం నాడు నారాయణను ఏపీ సీఐడీ పోలీసులుహైదరాబాద్‌లో అరెస్ట్ చేసి అనంతరం చిత్తూరుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట నారాయణను హాజరుపరిచారు. అయితే పోలీసులు మోపిన అభియోగాన్ని మేజిస్ట్రేట్ కోర్టు తోసిపుచ్చింది. నారాయణ తరఫు లాయర్ల వాదనలతో కోర్టు ఏకీభవించింది. 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి…