(జూలై 27న గాయని చిత్ర పుట్టినరోజు)మళయాళ కోయిలగా జన్మించినా, తెలుగు పాటలో సైతం అమృతం కురిపిస్తూ సాగుతున్నారు గాయని కె.ఎస్.చిత్ర. అందుకే తెలుగువారి మదిలో చెరిగిపోని, తరిగిపోని స్థానం సంపాదించారు చిత్ర. ఆమె గళం తొలుత అనువాద చిత్రాలలోనే తెలుగువారికి పరిచయమైనా, అనతికాలంలోనే అందరి మన్ననలు అందుకొన్నారు. ఇళయరాజా స్వరకల్పనలో విడుదలైన అనువాద చిత్రం ‘సింధుభైరవి’లో “పాడలేను పల్లవైనా…” అంటూ చిత్ర గాత్రం తెలుగువారి వీనులకు సోకి, ఆనందం పంచింది. ఆ తరువాత నుంచీ పలు తెలుగు…