మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి కెరీర్‌లో ఇది 157వ సినిమా కావడం విశేషం. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజా అప్‌డేట్ ఒకటి బయటకి వచ్చింది. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్టు సమాచారం. మెగా అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా దీన్ని సిద్ధం చేశారు మేకర్స్.…