Karumuri Nageswara Rao: జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవిని, సినిమా వాళ్ళని ఎంత గౌరవించి పంపారో ఆయన లేఖ ద్వారా బయట పడింది అని వైసీపీ నేత, మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. అసెంబ్లీలో చిరంజీవి మీద నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ నాగబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించకపోవడం శోచనీయం అన్నారు.