మెగాస్టార్ చిరంజీవి అంటేనే రికార్డుల రారాజు, ఆయన వెండితెరపై కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద పూనకాలే. తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం అమెరికా గడ్డపై సరికొత్త చరిత్రను లిఖించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, ఓవర్సీస్ మార్కెట్‌లో మెగాస్టార్ స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఒకప్పుడు మెగాస్టార్ రీ-ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా ప్రీమియర్స్ సమయంలో ట్యూస్డే…