Akhanda 2 Vs MSVG: ‘అఖండ 2’ ఫుల్ రన్ ప్రీమియర్స్’తో కొట్టిన శంకర వరప్రసాద్ గారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి అంటేనే రికార్డుల రారాజు, ఆయన వెండితెరపై కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద పూనకాలే. తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం అమెరికా గడ్డపై సరికొత్త చరిత్రను లిఖించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, ఓవర్సీస్ మార్కెట్‌లో మెగాస్టార్ స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఒకప్పుడు మెగాస్టార్ రీ-ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా ప్రీమియర్స్ సమయంలో ట్యూస్డే అడ్వాంటేజ్‌తో పాటు ‘T-Mobile’ వారి 2 డాలర్ల ఆఫర్ కూడా తోడైంది. అయితే, ఏలాంటి ఆఫర్లు లేకపోయినా, వీకెండ్ ముగిసే ఆదివారం రాత్రి ప్రీమియర్స్ పడినా ‘మన శంకర వరప్రసాద్ గారు’ఆ రికార్డులను అలవోకగా తుడిచిపెట్టేసింది. కేవలం ప్రీమియర్స్ తోనే 1.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసి, నార్త్ అమెరికాలో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ చిత్రం నార్త్ అమెరికాలో తన ఫుల్ రన్లో దాదాపు ఒక మిలియన్ డాలర్ల వరకు వసూలు చేసింది. కానీ, మెగాస్టార్ మేనియాతో ప్రీమియర్ షోల ద్వారానే ఆ చిత్రాన్ని దాటేసి, బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆదివారం ప్రీమియర్స్ జరగడం, సోమవారం వర్కింగ్ డే ఉన్నప్పటికీ $1.5 మిలియన్ (దాదాపు 12.5 కోట్లు) స్థాయి వసూళ్లు రావడం గమనార్హం. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ మరియు వింటేజ్ మెగాస్టార్ మేనరిజమ్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఇతర సినిమాల పోటీని తట్టుకుని ఈ విజయం సాధించడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి గారి ఎనర్జీ, దానికి తోడు వెంకటేష్ గారి క్యామియో అప్పియరెన్స్ సినిమాకు ప్రధాన బలంగా మారాయి, ఈ వేగం చూస్తుంటే, లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని రికార్డులను కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!