(జనవరి 4న హిట్లర్కు పాతికేళ్ళు)విజయాల చుట్టూ జనం పరిభ్రమిస్తూ ఉంటారు. ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవిని వరుస పరాజయాలు పలకరించాయి. ఆ సమయంలో ఆయన కథలపై దృష్టిని సారించారు. ఓ మంచి కథతో మళ్ళీ జనాన్ని పలకరించాలని ఆశించారు. ఆ నేపథ్యంలో మమ్ముట్టి హీరోగా మళయాళంలో రూపొంది విజయం సాధించిన హిట్లర్ ఆయన దృష్టిని ఆకర్షించింది. దానిని రీమేక్ చేస్తూ మళ్ళీ జనాన్ని ఆకట్టుకోవాలని ఆశించారు. ఆ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ఎడిటర్ మోహన్ తీసుకున్నారు.…