ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుండడంతో.. మెగాస్టార్ చిరంజీవిపై కూడా ఓ బయోపిక్ తీస్తే బాగుంటుందని ఒక వేదికపై సీనియర్ నటుడు బెనర్జీ చెప్పుకొచ్చారు. దీంతో, చిరు బయోపిక్‌కి బెనర్జీ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయంపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. చిరు బయోపిక్‌పై తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అన్నారు. చిరు బయోపిక్ తాను తీస్తానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి…