Off The Record: బాపట్ల జిల్లా చీరాల. నిన్న మొన్నటి వరకూ మూడు ముక్కలాటగా కొనసాగిన ఇక్కడ వైసీపీ వ్యవహారాలకు పార్టీ అధిష్ఠానం చెక్ పెట్టింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత చీరాల వైసీపీలో మూడు పవర్ సెంటర్స్‌గా మారటంతో పార్టీ పరిస్థితి మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్నట్టుగా తయారైంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేసి ఓడారు. ఆమంచిపై గెలిచిన…