కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఆర్‌సీబీ ఆటగాళ్లను సత్కరించడానికి రాజ్‌భవన్‌కు ఆహ్వానించాలని సిద్ధరామయ్య సర్కార్ ప్లాన్ చేసింది.. విధాన సౌధలోనే సన్మాన కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.. అయితే, విధాన సౌధలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా గవర్నర్‌ను ముఖ్యమంత్రి అధికారికంగా ఆహ్వానించారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన టైటిల్ పోరులో ఆర్సీబీ సంచలన విజయం సాధించి మొదటిసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ సాధించిన విజయాన్ని తమ విజయంగా భావించారు. బాణాసంచా కాలుస్తూ సంబరాల్లో మునిగితేలారు. మెట్రో సిటీలలో అభిమానం శృతి మించింది. రోడ్లపైకి వచ్చి క్రాకర్స్ కలుస్తూ…
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో బుధవారం (జూన్ 4) భారీ సన్మానం ఏర్పాటు చేసింది. ఆర్సీబీ విజయోత్సవంలో తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు అభిమానులు లక్షలాది సంఖ్యలో స్టేడియంకు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ తొక్కిసలాటకు పలు కారణాలు…
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ కప్‌ను సొంతం చేసుకోవడంతో.. విజయోత్సవాల కోసం బుధవారం (జూన్ 4) మధ్యాహ్నం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియానికి అభిమానులు భారీగా పోటెత్తారు. అంచనాకు మించి.. లక్షలాది సంఖ్యలో ఫాన్స్ స్టేడియానికి రావడంతో వారిని అదుపుచేయడం పోలీసుల వల్ల కాలేదు. సరిగ్గా అదే సమయంలో వర్షం కూడా రావడంతో.. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 50 మంది…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 విజయోత్సవ సంబరాలు విషాదంగా ముగిసాయి. బుధవారం ఆర్సీబీ ఆటగాళ్లు అహ్మదాబాద్ నుంచి సొంతగడ్డకు వస్తుండడంతో.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి లక్షలాది మంది అభిమానులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 11 మంది అభిమానులు మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విచారం వ్యక్తమైంది. చిన్నస్వామి…
నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ.. మొదటిసారి ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీకి ఘన స్వాగతం పలికేందుకు కర్ణాటక క్రికెట్ సంఘం బెంగళూరులో భారీ ఏర్పాట్లు చేసింది. బుధవారం చిన్నస్వామి స్టేడియం వద్దకు భారీ ఎత్తున అభిమానులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా…
18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీని సాధించిన విషయం తెలిసిందే. మంగళవారం (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో ఆర్సీబీ గెలవగానే బెంగళూరులో సంబరాలు మిన్నంటాయి. రాత్రంతా ఆ నగరం నిద్రపోలేదు. ర్యాలీలు, నినాదాలు, పటాసుల శబ్దంతో బెంగళూరు మొత్తం దద్దరిల్లింది. ఇక బుధవారం ఆర్సీబీ ఆటగాళ్లు సొంతగడ్డకు వస్తుండడంతో.. విజయోత్సవాలు ఇంకా గొప్పగా చేసుకోవాలనుకున్న అభిమానులకు…
ఆర్సీబీ ఆటగాళ్లు ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. వారికి ఇంకా పరిస్థితి తెలియకపోవచ్చు. అయితే.. సంఘటనలు జరిగినప్పటికీ వేడుకలు ప్రణాళిక ప్రకారం కొనసాగడం ఆందోళనకరంగా భావిస్తున్నారు. ఈ వేడుకలను ఉద్దేశించి విరాట్ కోహ్లీ మాట్లాడాడు. కానీ అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. కోహ్లీ.. కోహ్లీ అంటూ అరిచారు. నినాదాలను ఆపివేయమని కోరాడు.