కొంతకాలంగా చిన్మయి సినీ రంగంలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు చేస్తున్న వారిపై గళం విప్పుతూ వస్తున్నారు. ఎంత పెద్దవారైనా, తనకు పరిచయమైన వారైనా – ఎవరిపైనా వెనుకాడకుండా చిన్మయి మాట్లాడుతున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించిన, కాపాడినా ప్రభుత్వాలపై కూడా విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా గత ఏడాది డాన్స్ మాస్టర్ జానీ పై వచ్చిన ఆరోపణల సమయంలో కూడా చిన్మయి గళం విప్పారు. బాధితురాలికి న్యాయం జరగాలని, జానీ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం…