ప్రముఖ సింగర్ చిన్మయి పై మరోసారి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరిగింది. ఇంతకుముందు కూడా పలు సార్లు సోషల్ మీడియాలో చిన్మయి ట్రోల్స్‌కి గురయ్యారు కానీ ఈసారి హద్దులు దాటేశారు. అసలు సంగతి ఏంటంటే చిన్మయి భర్త, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఒక ఇంటర్వ్యూలో “మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా చిన్మయి నిర్ణయం” అని చెప్పారు. అదే విషయాన్ని కొందరు నెటిజన్లు వక్రీకరించి ట్రోలింగ్ మొదలుపెట్టారు. మొదట్లో ఆమెను, ఆమె భర్త ను టార్గెట్…