ప్రముఖ సింగర్ చిన్మయి పై మరోసారి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరిగింది. ఇంతకుముందు కూడా పలు సార్లు సోషల్ మీడియాలో చిన్మయి ట్రోల్స్‌కి గురయ్యారు కానీ ఈసారి హద్దులు దాటేశారు. అసలు సంగతి ఏంటంటే చిన్మయి భర్త, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఒక ఇంటర్వ్యూలో “మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా చిన్మయి నిర్ణయం” అని చెప్పారు. అదే విషయాన్ని కొందరు నెటిజన్లు వక్రీకరించి ట్రోలింగ్ మొదలుపెట్టారు. మొదట్లో ఆమెను, ఆమె భర్త ను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టారు. కానీ తర్వాత అసలు షాకింగ్ విషయం ఏంటంటే,
Also Read : katrina kaif-vicky : బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్..హ్యాపీ న్యూస్‌తో సోషల్ మీడియాలో హడావిడి!
తమ పిల్లలను కూడా లాగేశారు. “వాళ్లు చనిపోవాలి” అనే స్థాయిలో అసభ్యకరమైన పోస్టులు వేశారు. ఈ స్థాయి దారుణమైన కామెంట్లను చూసి చిన్మయి పూర్తిగా షాక్ అయ్యింది. తట్టుకోలేక హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కి ఆన్‌లైన్ ఫిర్యాదు చేసింది. తాను రాయలేని పదాలతో, తల్లిగా మనసును పిండేసే విధంగా వాళ్లు దూషిస్తున్నారని చిన్మయి ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారంపై సీపీ సజ్జనార్ వెంటనే స్పందించారు. సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు అప్పగించి, ట్రోలింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా తాజా సమాచారం ప్రకారం చిన్మయి ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు.
ఇక చిన్మయి చెప్పినట్టు “సోషల్ మీడియాలో మనం ఏ మాట అన్నా, ఎవరో ఒకరు వక్రీకరించి దాన్ని దాడిగా మార్చేస్తున్నారు. ఎదుటి వాని జీవితం పై ఇంత హద్దు దాటడం సరికాదు. నా కుటుంబం, నా పిల్లలను ఎందుకు లాగుతున్నారు?” అంటూ బాధను వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. “ట్రోల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి” అని చాలామంది నెటిజన్లు కూడా చిన్మయికి సపోర్ట్ చేస్తున్నారు.“ఇక ఇలాంటి వాళ్లను వదిలేస్తే రోజురోజుకీ మరింత హద్దు దాటిపోతారు” అంటున్నారు నెట్‌జన్లు.