టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘మన శంకర వరప్రసాద్’ సినిమా సక్సెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. సినీ పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ అనేది లేదని, పరిశ్రమ అద్దం లాంటిదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రముఖ గాయని, ‘మీటూ’ ఉద్యమకారిణి చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. చిరంజీవి పై గౌరవం ఉంచుతూనే, ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న చీకటి కోణాలను ఆమె బట్టబయలు చేశారు. Also…