Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా జిన్‌పింగ్ మిస్సవ్వడం చూస్తే, ఆ దేశంలో కొత్త నాయకుడు రాబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. చైనాలో అధ్యక్షుడి కన్నా శక్తివంతమైన పార్టీ పోలిట్‌బ్యూరో జిన్‌పింగ్ అధికారాలకు కత్తెర వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్‌పింగ్ హాజరుకాలేదు. గత 10 ఏళ్లలో బ్రిక్స్‌కు హాజరుకాకపోవడం ఇదే తొలిసారి.
China: పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ), చైనా మిలిటరీలో అవినీతి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో పలువురు ముఖ్య మిలిటరీ అధికారుల్ని విధుల నుంచి తొలగించారు. జిన్ పింగ్ అధికారంలో పలువురు ఉన్నతాధికారుల జాడ ఇప్పటికీ తెలియదు.
China's Ex President Jiang Zemin Dies: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ బుధవారం 96 ఏళ్ల వయసులో షాంఘైలో కన్నుమూశారు. చైనాను ఆర్థిక శక్తిగా నిలబెట్టడంతో పాటు ప్రజా ఉద్యమాలను అత్యంత క్రూరంగా అణచివేసిన వ్యక్తిగా జియాంగ్‌కు పేరుంది. బుధవారం లుకేమియా, అవయవాల వైఫల్యంతో మరణించినట్లు ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ( సీసీపీ) ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. ‘‘కామ్రేడ్ జియాంగ్ జెమిన్ ఒక అద్భుతమైన నాయకుడు...…