కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది.. ఇప్పటికీ చాలా దేశాలు దానిని నుంచ బయటపడలేకపోతున్నాయి.. ఈ తరుణంలో చైనాకు చెందిన ఎవర్‌గ్రాండే దివాలా అంచుకు చేరింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 300 బిలియన్ డాలర్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. చైనా జంక్ బాండ్స్ ఈల్డ్ ఒక్కసారిగా 14.4 శాతానికి పెరగడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 2008లో 600 బిలియన్ డాలర్లకు దివాలా తీసిన అమెరికా సంస్థ లేమన్ బ్రదర్స్ తర్వాత.. ఇదే అతిపెద్ద సంక్షోభం…